Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 65

Brahmarshi Viswamitra !!

|| om tat sat ||

బాలకాండ
అఱువది ఇదవ సర్గము

అథ హైమవతీం రామ దిశం త్యక్త్వా మహామునిః |
పూర్వాం దిశం అనుప్రాప్య తపస్తేపే సుదారుణమ్ ||

స|| హే రామ! అథ మహామునిః హైమవతీం దిశం త్యక్త్వా పూర్వాం దిశం అనుప్రాప్య సుదారుణం తపః తేపే ||

తా|| ఓ రామా ! అప్పుడు మహాముని హిమాలయముల దిశ వదిలేసి తూర్పు దిశకి తిరిగి మళ్ళీ దారుణమైన తపస్సు గావించెను.

మౌనం వర్ష సహస్రస్య కృత్వా వ్రతం అనుత్తమమ్ |
చకార ప్రతిమం రామ తపః పరమ దుష్కరమ్ ||

స|| హే రామ ! వర్ష సహస్రస్య అనుత్తమమ్ మౌనం వ్రతం కృత్వా పరమదుష్కరం తపః ప్రతిమం చకార ||

తా|| ఓ రామ ఒక వెయ్యి సంవత్సరములు ఉత్తమమైన మౌనవ్రతము పట్టి చాలా కష్ఠతరమైన తపస్సు చేసెను.

పూర్ణే వర్షసహస్రేతు కాష్ఠభూతం మహామునిమ్ |
విఘ్నైర్బహుభిరాధూతమ్ క్రోధో నాంతరమావిసత్ ||

స|| పూర్ణే వర్ష సహస్రే తు మహామునిం భూతం కాష్ఠం అభూత్ | బహుభిః విఘ్నైః అధూతమ్ (పరంతు) క్రోధః న అంతరమావిశత్ ||

తా|| వెయ్యి సంవత్సరములు గడినపిమ్మట మహాముని శరీరము కట్టె వలె అయ్యెను. చాలా విఘ్నములు కలిగినప్పటికీ ఏమాత్రము క్రోధము రాలేదు.

సకృత్వా నిశ్చయం రామ తప ఆదిష్ఠదవ్యయమ్ |
తస్య వర్ష సహస్రస్య వ్రతే పూర్ణే మహావ్రతః ||
భోక్తుమారబ్దవనన్నం తస్మిన్ కాలే రఘూత్తమ|
ఇంద్రో ద్విజాతిర్భూత్వా తం సిద్ధమన్నమయాచత ||

స|| హే రామ ! స అవ్యయమ్ నిశ్చయం కృత్వా తప అతిష్ఠత్ |హే రఘూత్తమ ! మహావ్రతః తస్య వర్ష సహస్రస్య వ్రతే పూర్ణే అన్నం భోక్తుమ్ ఆరబ్ధవత్ | తస్మిన్ కాలే ఇంద్రః ద్విజాతిః భుత్వా సిద్ధమన్నం అయాచత ||

తా|| ఓ రామా ఆయన పట్టుదలతో తపము లో తిష్ఠ వేసెను. ఓ రఘూత్తమ ! ఆ మహావ్రతుడు వెయ్యి సంవత్సరములు వ్రతము పూర్తి అవగానే సిద్ధ అన్నము భోజనము చేయుటకు సిద్ధపడెను. అదే సమయములో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి సిద్ధాన్నమును అడిగెను.

తస్మై దత్వా తదా సిద్ధం సర్వంవిప్రాయ నిశ్చితః |
నిశ్శేషితే అన్నే భగవాన్ అభుక్త్వైవ మహాతపాః||
న కించిదవద్విప్రం మౌనవ్రత ముపస్థితః |
అథ వర్ష సహస్రం వై నోచ్ఛ్వసన్మునిపుంగవ||

స|| నిశ్చితః సర్వం సిద్ధం విప్రాయ దత్వా నిశ్శేషితే అన్నే అభుక్త్వైవ మహాతపాః తస్మై న కించిద్ అవదత్ | అథ వర్ష సహస్రం న ఉచ్ఛ్వసన్ మునిపుంగవ మౌన వ్రత ముపస్థితః |

తా|| ఆ పూర్తి సిద్ధాన్న్నమంతయూ ఆ విప్రునికి ఒసగి అన్నము శేషములేకున్నప్పుడు తను తినక ఏమియూ అనలేదు. అప్పుడు వేయ్యిసంవత్సరములు ఉచ్ఛ్వాసముచేయకుండా మౌనవ్రతములో ఉండెను.

తస్యానుచ్ఛ్వసమానస్య మూర్ధ్ని ధూమో వ్యజాయత |
త్రైలోక్యం యేన సంభ్రాంతం అదీపితమివాభవత్ ||

స|| అనుచ్ఛ్వసమానస్య తస్య మూర్థ్ని ధూమో వ్యజాయత | యేన త్రైలోక్యం సంభ్రాంతం అదీపితం అభవత్ ||

తా|| ఆ ఊపిరిబిగపెట్టిన ఆయనయొక్క శిరస్సు నుండి ధూమము బయటకి వచ్చుచుండెను. దానిచేత ముల్లోకములు దగ్ధమౌతున్నట్లు అనిపించెను.

తతో దేవస్సగంధర్వాః పన్నగాసుర రాక్షసాః |
మోహితాస్తేజసా తస్య తపసా మందరశ్మయః ||

స|| తతః దేవః గంధర్వాః పన్నగ అసుర రాక్షసాః సః తస్య తపసా తేజసా మందరస్మయః మోహితాః ||

తా|| అప్పుడు దేవతలు పన్నగులు అసురులు రాక్షసులతో సహా ఆయన యొక్క తేజస్సుచే అశ్చర్యపోయి మూర్ఛితు లైరి.

కశ్మ లోపహతాస్సర్వే పితామహమథాబ్రువన్ |
బహుభిః కారణైర్దేవ విశ్వామిత్రో మహామునిః ||
లోభితః క్రోధితశ్చైవ తపసా చాభివర్తతే |
న హ్యస్య వృజినం కించిత్ దృశ్యతే సూక్ష్మ మప్యథ||

స|| సర్వే కశ్మలోపహతాః పితామహం అథ అబ్రువన్ | హే దేవ ! మహామునిః విశ్వామిత్రః బహుభిః కారణైః లోభితః క్రోధితః చ |అథ న కించిత్ సూక్ష్మం వృజినం అపి దృశ్యతే ||

తా|| వారందరూ దుఃఖాక్రాంతులై పితామహుని అప్పుడు చెప్పిరి. " ఓ దేవా ! మహాముని యగు విశ్వామిత్రునికి అనేక కారణములవలన ప్రలోభించుటకు కోపము తెప్పించుటకు ప్రయత్నము చేయబడెను. అప్పుడు (ఆ ప్రయత్నములు) కొంచెమైన ఫలించ లేదు |

న దీయతే యది త్వస్య మనసా యదీప్సితమ్|
వినాశయతి త్రైలోక్యం సంప్ర క్షుభితమానసమ్ ||

స|| యది త్వస్య మనసా యదీప్సితం (తత్) న్ దీయతే సంప్ర క్షుభిత మానసం త్రైలోక్యం వినాశయతి ||

తా|| ఒకవేళ ఆయన మనసులో ఉన్న కోరిక తీరకపోతే ముల్లోకములను నాశనము చేయకలడు.

వ్యాకులాశ్చ దిశస్సర్వా న చ కించిత్ ప్రకాశతే |
సాగరాః క్షుభితాస్సర్వే విశీర్యంతే చ పర్వతాః ||

స|| దిశః సర్వాః వ్యాకులాః | న కించి ప్రకాశతే | సర్వే సాగరాః క్షుభితాః | పర్వతాః చ విశీర్యన్తే ||

తా|| దిశలన్నీ వ్యాకులమైనవి . ఏమీ ప్రకాశించుటలేదు. సాగరములన్నీ క్షోభములో ఉన్నాయి. పర్వతములు శిథిలమగుతున్నాయి.

ప్రకంపతే చ పృథివీ వాయుర్వాతి భృశాకులః|
బ్రహ్మన్ న ప్రతిజానీమే నాస్తికో జాయతే జనః ||

స|| పృథివీ చ ప్రకంపతే | వాయుః భృశాకులః వాతి | నాస్తికో జాయతే జనః |హే బ్రహ్మన్ న ప్రతిజానీమే ( కింకరవామః ఇతి)

తా|| భూమి ప్రకంపించుచున్నది. వాయువు ప్రచండముగా వీచుచున్నది. జనులు నాస్తికులగుచున్నారు. ఓ బ్రహ్మన్ ! ఏమిచేయుటకు తెలియుటలేదు.

సమ్మూఢమివ త్రైలోక్యం సంప్ర క్షుభిత మానసమ్ |
భాస్కరో నిష్ప్రభశ్చైవ మహర్షేః తస్య తేజసా ||

స|| భాస్కరః తస్య తేజసా నిష్ప్రభశ్చ ఏవ | సంప్రక్షుభిత మానసం త్రైలోక్యం సమ్మూఢమివ |

తా|| సూర్యుడు ఆయన తేజస్సుచే సూర్యుడు ప్రభలేనివాడు అయ్యెను. మూడులోకములు మానసిక క్షోభకు గురి అయి మూర్చ్ఛితులై వున్నారు.

బుద్ధిం న కురుతే యావన్నాశే దేవ మహామునిః |
తావత్ ప్రసాద్యో భగవాన్ అగ్నిరూపో మహాద్యుతిః |

స|| హే దేవ! మహామునిః అగ్నిరూపః మహాద్యుతిః ! యావత్ నాశే బుద్ధిం న కురుతే తావత్ భగవన్ ప్రసాద్యో ||

తా|| ఓ దేవా ! మహాముని అగ్ని రూపము గలవాడు. ఆయన నాశనము చేయు బుద్ధి కలుగక ముందే భగవన్ ఆయనకి ప్రసాదించవలెను.

కాలాగ్నినా యథా పూర్వం త్రైలోక్యం దహ్యతే అఖిలమ్ |
దేవరాజ్యం చికీర్షేత దీయతామస్య యన్మతమ్ ||

స|| యథా పూర్వం కాలాగ్నినా త్రైలోక్యం దహ్యతే అఖిలమ్ | దేవరాజ్యం చికీర్షేత అస్య దీయతామ్ |

తా|| పూర్వము కాలాగ్ని వలె (విశ్వామిత్రుడు) అఖిలము దహింపగలవాడు , దేవరాజ్యము అడిగినను ఆయనికి ఇవ్వతగును.

తత స్సురగణాః సర్వే పితామహపురోగమాః |
విశ్వామిత్రం మహాత్మానం మధురం వాక్యమబ్రువన్ ||

స|| తతః పితామహపురోగమాః సురగణాః సర్వే విశ్వామిత్రమ్ మాహాత్మానం మధురం వాక్యమబ్రువన్ |

తా|| అప్పుడు పితామహుని ముందుగా ఉంచుకొని అన్ని సురగుణములు విశ్వామిత్రునితో మధురమైన వాక్యములను పలికిరి.

బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపాసా స్మ సుతోషితాః |
బ్రాహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానపి కౌశిక ||

స|| బ్రహ్మర్షే ! తే స్వాగతం అస్తు | స్మ తపసా సుతోషితాః |హేకౌశిక బ్రహ్మణ్యం ఉగ్రేణ తపసా ప్రాప్తవాన్ అపి ||

తా|| "ఓ బ్రహ్మర్షీ ! నీకు స్వాగతము. నీ తపస్సు తో సంతోషపడిన వారము. ఓ కౌశిక ! ఉగ్ర తపస్సు చే బ్రహ్మత్వము పొందినవాడవు".

దీర్ఘమాయుశ్చ తే బ్రహ్మన్ దదామి సమరుద్గణః |
స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గఛ్ఛ సౌమ్య యథా సుఖం ||

స|| హే బ్రహ్మన్ ! స మరుద్గణః తే దదామి దీర్ఘమాయుః | స్వస్తి ప్రాప్నుహి | భద్రం తే| హే సౌమ్య యథా సుఖం గచ్ఛ ||

తా|| "ఓ బ్రహ్మన్ ! మరుద్గణములతో కూడి నీకు దీర్ఘాయువు ప్రసాదించుచున్నాము. నీకు శుభమగు గాక. ఓ సౌమ్యుడా సుఖముగా వెళ్ళుము".

పితామహవచశ్రుత్వా సర్వేషాం చ దివౌకసామ్|
కృత్వా ప్రణామం ముదితో వ్యాజహార మహామునిః ||

స|| ముదితో మహామునిః పితామహ వచః శ్రుత్వా సర్వేషాం దివౌకసాం ప్రణామం కృత్వా వ్యాజహార ||

తా|| పితామహుని వచనములను విని సంతోషపడిన వాడై, ( విశ్వామిత్రుడు) అందరు దేవతలకి ప్రణామములు చేసి ఇట్లు పలికెను.

బ్రాహ్మణం యది మే ప్రాప్తం దీర్ఘమాయుః తథైవ చ |
ఓంకారశ్చ వషట్కారో వేదాశ్చ వరయంతు మామ్ ||

స|| యది మే బ్రాహ్మణం ప్రాప్తం తథైవ దీర్ఘమాయుః వషట్కారః ఓంకారశ్చ వేదాశ్చ మాం వరయంతు ||

తా|| "నాకు బ్రహ్మత్వము అలగే దీర్ఘాయువు ప్రాప్తించినచో వషట్కారము ఓంకారము వేదములు ప్రసాదించుదురు గాక".

క్షత్ర వేద విదాం శ్రేష్ఠో బ్రహ్మ వేద విదామపి|
బ్రహ్మపుత్రో వసిష్ఠో మాం ఏవం వదతు దేవతాః ||

స|| హే దేవతాః ! క్షత్రవేద విదాం బ్రహ్మవేదవిదామపి శ్రేష్ఠః బ్రహ్మపుత్త్రః వసిష్ఠః మామ్ ఏవం వదతు ||

తా|| "ఓ దేవులారా ! క్షత్రవేదములు తెలిశినవాడు బ్రహ్మ వేదము తెలిసినవాడు బ్రహ్మపుత్త్రుడైన వసిష్ఠుడు నన్ను ఇదేవిధముగా పిలుచు గాక" .

యద్యయం పరమః కామః కృతో యాంతు సురర్షభాః |
తతః ప్రసాదితో దేవైః వసిష్ఠో జపతాం వరః ||
సఖ్యం చకార బ్రహ్మర్షిః ఏవమస్త్వితి చాబ్రవీత్ |
బ్రహ్మర్షిత్వం న సందేహః సర్వం సంపత్స్యతే తవ ||
ఇత్యుక్త్వా దేవతాశ్చాపి సర్వా జగ్ముః యథాగతమ్ ||

స|| హే సురర్షభాః యది అయం పరమం కామః కృతో యాంతు | తతః దేవైః వసిష్ఠో జపతాం వరః ప్రసాదితః సఖ్యం చకార || బ్రహ్మర్షిః ఏవం అస్తు ఇతి చ అబ్రవీత్|| తవ బ్రహ్మర్షిత్వం న సందేహః. సర్వం సంపత్స్యతే ఇతి ఉక్త్వా దేవతాః సర్వే యథాగతం జగ్ముః అపి ||

తా|| "ఓ సురులారా ! ఈ నాకోరిక తీర్చి వెళ్ళుదురుగాక". అప్పుడు దేవతలు జపముచేయువారిలో వరిష్ఠుడైన వసిష్ఠుని ప్రసన్నుని చేసుకోని ( విశ్వామిత్రునితో) సఖ్యముచేసిరి. బ్రహ్మర్షి( వసిష్ఠుడు) కూడా అట్లే అగుగాక అని చెప్పెను. అప్పుడు దేవతలు ," నీ బ్రహ్మర్షిత్వమునకు సందేహము లేదు. అన్నియూ సమకూరును " అని చెప్పి తమ తమ స్థానములకు పొయిరి.

విశ్వామిత్రోsపి ధర్మాత్మా లబ్ధ్వా బ్రాహ్మణ్య ముత్తమమ్ |
పూజయామాస బ్రహ్మర్షిం వసిష్ఠం జపతాం వరమ్|
కృతకామో మహీం సర్వాం చచార తపసి స్థితః ||

స|| ధర్మాత్మా విశ్వామిత్రః ఉత్తమమ్ బ్రాహ్మణ్యమ్ లబ్ధ్వా వసిష్ఠం జపతాం వరం బ్రహ్మర్షిం పూజయామాస | కృతకామః తపసి స్థితః సర్వాం మహీమ్ చచార ||

తా|| ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు కూడా ఉత్తమమైన బ్రహ్మర్షిత్వము పొంది జపము చేయు వారిలో వరుష్ఠుడైన బ్రహ్మర్షి వసిష్ఠుని పూజించెను. తన కోరికలను తీర్చుకునినవాడై తపస్సు చేయుచూ భూమండలమంతయూ తిరిగెను.

ఏవం త్వనేన బ్రాహ్మణ్యం ప్రాప్తం రామ మహాత్మనా |
ఏష రామ మునిశ్రేష్ఠ ఏష విగ్రహవాంస్తపః ||

స|| హే రామ || త్వనేన ఏవం బ్రహ్మణ్యం ప్రాప్తమ్| హే రామ ఏషః మునిశ్రేష్ఠః| ఏషః తపస్య విగ్రహవాన్ ||

తా|| 'ఓ రామా ! ఆయన ఈవిధముగా బ్రహ్మత్వము పొందెను. ఓ రామ ఈయన మునులలో శ్రేష్ఠుడు. ఈయన తపస్సుకిమూర్తి’'.

ఏష ధర్మపరో నిత్యం వీర్యస్యైష పరాయణమ్ |
ఏవ ముక్త్వా మహాతేజ విరరామ ద్విజోత్తమః ||

స|| ఏషః నిత్యమ్ ధర్మపరః ఏషః వీర్యస్య పరాయణమ్ | మహాతేజా ద్విజోత్తమః ( శతానందః ) విరరామ ||

తా|| "ఈయన నిత్యము ధర్మపరాయణుడు.ఈయన మహాపరాక్రమశాలి". ఈ విధముగా చెప్పి ఆ మహా తేజోవంతుడైన ద్విజోత్తముడు ( శతానందుడు) మిన్నకుండెను.

శతానంద వచః శ్రుత్వా రామలక్ష్మణ సన్నిధౌ |
జనకః ప్రాంజలిం ర్వాక్య మువాచ కుశికాతజమ్||

స|| రామ లక్ష్మణ సన్నిధౌ శతానందః వచః శ్రుత్వా జనకః ప్రాంజలిః కుశికాత్మజం ఉవాచ ||

తా|| రామ లక్ష్మణుల సన్నిధిలో శతానందుని వచనములను విన్న జనకుడు ప్రాంజలి ఘటించి కుశికాత్మజుని తో ఇట్లు పలికెను.

ధన్యోస్మి అనుగ్రహీతోశ్మి యస్య మే మునిపుంగవ |
యజ్ఞం కాకుత్‍స్థసహితః ప్రాప్తవానపి ధార్మిక ||

స|| హే మునిపుంగవ ! యస్య కాకుత్‍స్థ సహితః యజ్ఞం ప్రాప్తవాన్ అపి అనుగ్రహీతః అస్మి| హే ధార్మిక ధన్యః అస్మి |

తా|| "ఓ మునిపుంగవ! ఈ కాకుత్‍స్థులతో యజ్ఞమునకు విచ్చేసి నన్ను అనుగ్రహించితిరి. ఓ ధార్మిక నేను ధన్యుడనైతిని".

పావితోsహం త్వయా బ్రహ్మన్ దర్శనేన మహామునే|
గుణా బహువిధాప్రాప్తాః తవ సందర్శనాన్ మయా||

స|| "హే బ్రహ్మన్ ! మహామునే | త్వయా దర్శనేన అహం పావితః | తవ సందర్శనాన్ మయా బహువిధా గుణా ప్రాప్తాః" ||

తా|| "ఓ బ్రహ్మర్షీ మహామునీ నీ దర్శనముతో నేను పావకూడనైతిని. నీ దర్శనముతో నాకు అనేక గుణములు ప్రాప్తించినవి".

విస్తరేణ చ తే బ్రహ్మన్ కీర్త్యమానం మహత్తపః ||
శ్రుతం మయా మహాతేజో రామేణ చ మహాత్మనా |
సదస్యైః ప్రాప్య చ సదః శ్రుతాస్తే బహవో గుణాః ||

స|| హే బ్రహ్మన్ విస్తరేణ కీర్త్యమానం తే మహత్తపః మయా మహాత్మనా రామేణ చ శ్రుతం ||సదః సదస్యైః తే బహవో గుణాః ప్రాప్య శ్రుతాః ||

తా|| "ఓ బ్రహ్మన్ విస్తరముగా కీర్తింపబడిన నీ తపస్సు మహాత్ముడగు రాముని చేత నాచేత వినడమైనది. సదస్సులో సదస్యులు కూడా మీ ఉదాత్తగుణములను వినిరి".

అప్రమేయం తపస్తుభ్యం అప్రమేయం చ తే బలమ్|
అప్రమేయా గుణాశ్చైవ నిత్యం తే కుశికాత్మజ ||

స|| హే కుశికాత్మజ ! తుభ్యం తపః అప్రమేయం | తే బలం చ అప్రమేయమ్ | తే గుణాశ్చైవ అప్రమేయమ్ |

తా|| "ఓ కుశికాత్మజ ! మీ తపస్సు అప్రమేయము. మీ బలము అప్రమేయము. మీ గుణములు అప్రమేయము".

తృప్తిరాశ్చర్యభూతానాం కథానాం నాస్తి మే విభో|
కర్మకాలో మునిశ్రేష్ఠ లంబతే రవి మండలమ్ ||

స|| హే విభో ఆశ్చర్యభూతానాం కథానాం తృప్తిః నాస్తి | హే మునిశ్రేష్ఠ రవి మండలం లంబతే | కర్మకాలః అపి ||

తా|| "ఓ ప్రభో ! ఆశ్చర్యభూతమైన మీ కథ ఎంత విన్నను తృప్తి కలగదు. ఓ మునిశ్రేష్ఠ సూర్యుడు అస్తమించుచున్నాడు’".

శ్వః ప్రభాతే మహాతేజో ద్రష్టుమర్హసి మాం పునః|
స్వాగతం తపతాం శ్రేష్ఠ మామనుజ్ఞాతు మర్హసి ||

స|| మహాతేజః శ్వః ప్రభాతే మాం పునః ద్రష్ఠుమర్హసి | స్వాగతం తపతాం శ్రేష్ఠ మాం అనుజ్ఞాతు మర్హసి ||

తా|| "ఓ మహాతేజా ! రేపు ఉదయము మాకు పునర్దర్శనమునకు అనుమతి ఇవ్వుడు. మీకు స్వాగతము. మాకు అనుమతి ఇవ్వుడు".

ఏవముక్తో మునివరః ప్రశస్య పురుషర్షభమ్|
విససర్జాశు జనకం ప్రీతం ప్రీతమనాస్తదా ||

స|| మునివరః ఏవం ఉక్తః ప్రీతం ప్రీతమనాః తదా జనకం ప్రసస్య విససర్జాశు||

తా|| ఆ మునివరుడు ఇట్లు చెప్పబడినవాడై సంతోషపడి సంతోషముతో జనకుని ప్రశంసించి వారికి అనుమతినిచ్చెను.

ఏవముక్త్వా మునిశ్రేష్ఠం వైదేహో మిథిలాధిపః|
ప్రదక్షిణం చకారాశు సోపాధ్యాయస్సబాంధవః ||

స|| వైదేహో మిథిలాధిపః ముని శ్రేష్ఠం ఏవం ఉక్త్వా స ఉపాధ్యాయ బాంధవాః ప్రదక్షిణమ్ చకారాశు ||

తా|| మిథిలాధిపతి అయిన వైదేహి ముని శ్రేష్ఠుని తో ఇట్లు చెప్పి తన పురోహితులు బాంధవులతో ప్రదక్షిణము చేసి వెళ్ళెను.

విశ్వమిత్రోsపి ధర్మాత్మా సహరామస్సలక్ష్మణః|
స్వవాస మభిచక్రామ పూజ్యమానో మహర్షిభిః ||

స|| మహర్షిభిః పూజ్యమానః ధర్మాత్మా విశ్వామిత్రః అపి రామ లక్ష్మణ సహ స్వవాసం అభిచక్రామ ||

తా|| ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు మహర్షులచే పూజింపబడి రామ లక్ష్మణులతో సహా తన నివాసమునకు చేరెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే పంచ షష్టితమస్సర్గః ||

||ఈ విథముగా శ్రీమత్ వాల్మీకి రామాయణములో బాలకాందలో అఱువది ఇదవ సర్గ సమాప్తము||


||om tat sat||